గొర్రెల పoపిణీకి లబ్దిదారుల ఎంపిక

కరీంనగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): జిల్లాలో గొర్రెల పెంపకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని పశు సంవర్థక శాఖ అధికారి విక్రమ్‌కుమార్‌ చెప్పారు. మొదటి విడతగా యూనిట్ల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించామని వివరించారు. తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, గొర్రెల యూనిట్ల కొనుగోలుకు కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి అందరికీ గొర్రెల యూనిట్ల పంపిణీ సాధ్యం కాదని అన్నారు. ఎంపికైన లబ్ధిదారులను మండలం, గ్రామాల వారీగా లాటరీ పద్ధతి ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎంపిక చేసి క్రమపద్ధతిలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని సూచించారు. ముందస్తుగా ఎంపికైన వారికి ముందుగా గొర్రెలను అందజేస్తామని అన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీకి ఇప్పటికే ఆదేశించారు. గొల్ల, కుర్మ, యాదవ కులాల సంక్షేమానికి ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు.