గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. హరిత తెలంగాణ సాకారం కోసం ప్రభుత్వం పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేస్తోంది. మొక్కలు పెంచాలి..పచ్చదనం పెరగాలన్నా సకాలంలో వానలు కురియాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసారి మహిళలకు అవసరమయ్యే పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీలో మొక్కలను పెంచడానికి విత్తనాలు అందజేస్తున్నామని అధికారులు అన్నారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ల ఎదుట, పొలాల వద్ద నాటడానికి అనువైన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నామన్నారు. కుక్కుడు, సీతాఫల్‌, మలబార్‌ వేప, కానుగ, ఎర్రచందనం, శ్రీగంధం, టెకోర్‌, అడవితంగేడు, వేదురు, గోరింటాకు, పారిజాతం, కర్జురా, చింత, మునగా, వెలగ, జామా, బొప్పాయి, తదితరల మొక్కల విత్తనాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.