గ్రామాభివృద్దిలో సర్పంచులే కీలకం

సర్పంచులకు సూచించిన శాసనమండలి విప్‌

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): కొత్తగా ఎన్‌ఇనకైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దిలో కీలకంగా వ్యవహరించాలని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సూచించారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన అబివృద్ది కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ది బాట పట్టించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.  బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట, కొడవటూర్‌, ఆలీంపూర్‌లకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లుని సోమవారం హైదరాబాద్‌లో ఆయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. కొడవటూర్‌, బచ్చన్నపేట, ఆలీంపూర్‌ సర్పంచులు గంగం సతీశ్‌రెడ్డి, వ్డడెపల్లి మల్లారెడ్డి, నరెడ్ల బాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ రమణారెడ్డి, చంద్రారెడ్డి, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు కలిసినవారిలో ఉన్నారు.

‘పొదుపు నిర్వహణలో చైతన్య పరచాలి’

పొదుపు చేయడంలో గ్రావిూణ మహిళ సంఘాల్లో ఆయా సంఘాల అధ్యక్షురాళ్లు చైతన్యం తీసుకురావాలని ఐకేపీ ఏపీఎం జ్యోతి సూచించారు. ప్రతి నెలవారి సమావేశం మాదిరిగానే సోమవారం సంఘాల అధ్యక్షులతో బచ్చన్నపేట మండల సమైఖ్య సమావేశం నిర్వహించాలన్నారు. పొదుపు, బ్యాంకు శ్రీనిధి నుంచి తీసుకున్న అప్పులు నెలనెలా సక్రమంగా చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. అదే పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. సంఘాల నిర్వహణల్లో పై స్థాయిల్లో వస్తున్న మార్పులను సంఘాల సభ్యులకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. ఆమెతో పాటు సీసీలు నరసింహులు, మల్లేశం, విజయలక్ష్మి, తిరుమల, వివిధ గ్రామాల్లో సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.