గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించిన డిఎల్పిఓ

 

 

 

 

 

గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించిన డిఎల్పిఓ
బాల్కొండ ఫిబ్రవరి 1 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని డిఎల్పిఓ శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మాసములో ఎమ్మార్వో  సర్వే చేసి  గ్రామీణ క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలం ప్రభుత్వ స్థలంగా కేటాయించి కలెక్టర్ కు పంపడం జరిగిందని తెలిపారు. గ్రామీణ క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలం  ప్రభుత్వానిది కాదని తాము కొనుగోలు చేసిన భూమి అని దివాన్ వెంకటేష్, బ్రహ్మరవుతు నర్సింగ్ రావు పలువురు ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. బాధితులు దివన్ వెంకటేష్  మాట్లాడుతూ  గత 40 సంవత్సరాల ఇంటి నిర్మాణ అనవళ్లు కూడా స్థల ప్రదేశం లొ ఉన్నాయని ఈ భూమిని తాము కొనుగోలు చేశామని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు డాక్యుమెంట్లు గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని తమకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని బాధిలు ఆవేదన వ్యక్తం చేశారు. డి ఎల్ పి ఓ  శ్రీనివాసు బాధితులు ఇచ్చిన పత్రాలను  తీసుకొని  ఆ స్థలానికి వెళ్లి  పరిశీలించారు. తగు పత్రాలను పరిశీలించిన తర్వాత  నివేదికను అందజేస్తానని  బాధితులకు తెలియజేశారు. డి ఎల్ పి ఓ వెంట గ్రామ పంచాయతీ ఈవో నర్సయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది బాధితులు ఉన్నారు .