గ్రామ అభివృద్దికి ప్రణాళిక

పనులు ముమ్మరంగా సాగుతున్నాయ్‌: సర్పంచ్‌
అదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ మండలం ముఖరా గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికపై సమావేశం జరిగింది. సర్పంచ్‌ గాడ్గెవిూనాక్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సర్పంచ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా మెరుగయిదని తెలిపిన సర్పంచ్‌.. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ, 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యచరణలో జరిగిందని ఆమె అన్నారు. ఇంటింటకీ తాగు నీరు, మరుగు దొడ్ల నిర్మాణం, ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చకచకా జరుగుతున్నాయని సర్పంచ్‌ అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీ లాంటి మొదలగు పనులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. గ్రామంలో గణనీయంగా మొక్కలు నాటామని సర్పంచ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె  సుభాష్‌, ఉప సర్పంచ్‌ వర్ష, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.