గ్రావిూణ క్రీడలకు పెద్దపీట: కొప్పుల

పెద్దపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): గ్రావిూణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 64వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌.జి.ఎఫ్‌ ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అండర్‌ 14.. అండర్‌ 17 వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌ క్రీడాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. మొదటగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని.. వాలీబాల్‌ సర్వ్‌ చేసి ఆటలను ప్రారంభించారు. ఈ మండల స్థాయి నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను చీఫ్‌ విప్‌ కొప్పుల అభినందించారు. అనంతరం చీఫ్‌ విప్‌ విూడియాతో మాట్లాడారు. క్రీడలను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఉన్న విద్యావ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో.. అలానే అన్ని రంగాలను సమపాలనలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఈశ్వర్‌ వివరించారు.