గ్రావిూణ యువత జాబ్‌ మేళారను సద్వినియోగం చేసుకోవాలి

-ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌

దర్మపురి, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):గ్రావిూణయువత జాబ్‌ మేలాలను సద్వినియోగం చేసుకుని ఉపాది అభివృద్ది చెందాలని ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నా రు. గురువారం ధర్మపురిలోని స్థానిక పాత టీటీడి కళ్యాణమండపంలో మహాజాబ్‌మేలాకు హాజరై మాట్లాడారు. గ్రావిూణ ప్రాంత యువతీ యువకులకు ఉపాది కల్పనకు కంపెనీలను రప్పించి మహాజాబ్‌ మేళాను ఏర్పాటు చేశామన్నరు. 29 కంపెనీలు రాగా 3 వేలమందికి ఉపాది కల్పించే అవకాశం ఉందన్నారు. చదువుకున్న ప్రతి ఓక్కరికి ప్రభుత్వ ఉద్యోగంసాద్యం కాదని పోటీకి తట్టుకుని ప్రతిభ వున్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పన సాద్యం కాదని పోటీకి తట్టుకుని ప్రతిభ ఉన్నవారు పొందగలుగుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి ఇది మంచి అవకాశమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభను నిరూపించి అభివృద్ది చెందాలన్నారు. వేతనం తక్కువని ఆలోచించవద్దని, ప్రైవేట్‌ రంగంలో ప్రతిభ నైపుణ్యంతో వేగంగా అభివృద్ది చెందవచ్చన్నారు. అభివృద్ది చెందాలంటే ఒక్కో మెట్టు ఎక్కాలని కాకుంటే అక్కడే ఉండిపోతారన్నారు. ప్రస్తుత ఉద్యోగాలతో అనుభవం వస్తుందని పనితనం కలుగుతుందని జీవితంలో ముందడుగు వేస్తారన్నారు. గ్రావిూణ ప్రాంత యువతలో చదువుతోపాటు నైపుణ్యం ఉందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో అభివృద్ది చెందాలని సూచించారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎశరత్‌ మాట్లాడుతూ ఇష్టపడి కష్టపడి పనిచేస్తే జీవితంలో పురోగతి సాదిస్తారన్నారు. కంపెనీలుగౌరవ వేతనంతోపాటు వసతులు కల్పించాలన్నారు. 73మాత్రమే జిడిపి ఉందని దీన్ని వృద్‌ఇ చాలా అవసరమన్నారు. యువతీ యువకులలో ఉన్న శక్తిని ఉపయోగంలోకి తెచ్చినప్పుడు గ్రామాలు ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని గ్రామాల అభివృద్ది దేశాభివృద్దన్నారు., చైనాలో జనాభా ఎక్కువగా ఉన్నా యువత శాతం తక్కువగాఉందని రాను రాను అన్ని కంపెనీలు మన దేశానికి వస్తాయన్నారు. 29 కంపెనీలు 3 వేల మందికి నియామకం చేయాలన్నారు. జాబ్‌మేళాలో నియామకం పోందిన వారి సమస్యలను పరిష్కారానికి సందేహాల నివృత్తికి జిల్లా గ్రావిూణాబివృద్ది కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని ఆసెల్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అరుణశ్రీ, ఎంపిడిఓ శశికల, తహశీల్దార్‌ నరెందర్‌, ధర్మపురి ఎంపిపి మమత, సర్పంచ్‌ సత్తమ్మ, ఆలయ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.