*ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ*

రేగొండ (జనం సాక్షి) : మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో భాగంగా ఆదివారం మొదటి రోజు వైభవంగా మొదలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆడపడుచులు ఉదయం లేవగానే స్నానలు ఆచరించి తీరకపువ్వు సేకరించి బతకమ్మలను పేర్చారు. సాయంత్రం గ్రామాల లోని, భూలక్ష్మి మహాలక్ష్మి , సీతా రామాలయాలలో బతుకమ్మలను పెట్టి ఆడుకున్నారు. పిత్ర మస్తాన్ పురస్కరించుకొని పెద్దలకు బియ్యం ఇచ్చి మొక్కులు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పిటిసి సాయిని విజయ ముత్యం, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఆయా పార్టీల నేతలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.