*ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 (జనం సాక్షి)..
తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు, వీరవనిత, భూమికోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిప్రదాత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , రాణవేణి సుజాత సత్యనారాయణ, కమిషనర్ సల్వాది సమ్మయ్య ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ తన పోరాట జీవితం ద్వారా పీడిత ప్రజల కోసం పనిచేసిందని తెలిపారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఐలమ్మ జీవితాన్ని ముందు తరానికి తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రజక సంఘాల అధ్యక్షులు వడ్నాల లక్ష్మణ్ ,వన్నెల సాయిలు, పిప్పరి రాజు, వన్నెల శశి , పిప్పెర శేఖర్ , పిప్పిర రాజేష్, పుల్లూరు నరసయ్య, వన్నెల అంజయ్య ,పుల్లూరి హంసయ్య, పుల్లూరి దశరథం రజక సంఘ నాయకులు కౌన్సిలర్స్, కోఆప్షన్స్, అధికారులు తదితరులు పాల్గొన్నారు .