ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతిలో పాల్గొన్న వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముదిరాజ్ సంఘం నేతలు

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా, వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య అని తన వ్యక్తిగత జీవితం బాగున్నప్పటికీ పోలీసు ఉద్యోగం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భరించలేక,  ఆంధ్రుల పెత్తనం చూడలేక ఇక తెలంగాణ రాదేమోని,మన బతుకులు మారవు అని, మనోవేదనకు గురై తన త్యాగంవలన ఐనా తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే రానున్న భవిష్యత్తులో యువత జీవితాలు, మెరుగుపడతాయని భావించి, మలిదశ ఉద్యమంలో మొట్టమొదట తన ప్రాణాలర్పించిన, పోలీస్ కిష్టయ్య, ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి అని ఆయన సేవలు మరువలేనివి అని ,పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కంచరవి, మత్స్యకార సంఘం నేతలు, చేన్న రాములు, పుట్ట బాలరాజ్, నందిమల్ల అశోక్, నందిమల్ల చంద్రమౌళి, శ్రీనాథ్, పెద్దిరాజు, యాదగిరి, చాపల సురేష్, పుట్టా బాలరాజ్ ఉత్తరయ్య, ఎర్రమన్యం, పిట్ట శీను, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.