ఘనంగా హనుమాన్ జండా ఊరేగింపు యాత్ర

స్టేషన్ ఘన్పూర్, మే 24 , ( జనం సాక్షి ),
మండలంలోని తాటికొండ లో హనుమాన్ జయం తిని పురస్కరించుకొని మంగళవారం రోజున హనుమాన్ మాలాధారణ భక్తులు హనుమాన్ జండా ఊరేగింపుయాత్ర అన్నివీధులుతిరుగుతూ హనుమాన్ జెండా యాత్ర ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా వీర ఆంజనేయ స్వామి దేవ స్థానంలో హనుమాన్ మాలాధారణ భక్తులు యజ్ఞం కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇరుముడి కట్టు కున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.