చంద్రబాబు చేతిలో స్టీరింగ్‌

 

కోదండరామ్‌ను డవ్మిూ చేయడం ఖాయం

కెసిఆర్‌ చెప్పినట్లుగానే వంద సాధిస్తాం: జోగురామన్న

ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): కూటమిని తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్‌ అంటూ ముందుకు తెచ్చారని మంత్రి జోగురామన్న అన్నారు. స్టీరింగ్‌ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోయే సీట్లను టీజేఎస్‌కు అంటకడుతోందన్నారు. కోదండరాం నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు టిఆర్‌ఎస్‌ గెల్చుకోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన వివ్వాసంతో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించేలా ముందుకు సాగుతున్నారని అన్నారు. సోమవారం ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదండరాంపై కాంగ్రెస్‌ ఎంత కుట్ర చేసిందో, చంద్రబాబు ఎంత అవమానపరిచాడో ఆయన మరిచిపోయినా ప్రజలు మరిచిపోరన్నారు. . వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వశం అయ్యాడన్నారు. ఆనాడు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్‌ కుట్రలు చేసింది నిజం కాదా అని అన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులపై ఉస్మానియా విద్యార్థులపై కేసులు పెట్టింది కాంగ్రెస్‌ అన్నారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేవిూ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. మరో ఐదేళ్లు అధికారం ఇస్తే ప్రతీ గ్రామం నందనవనంగా తయారు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీతో కాంగ్రెస్‌ జత కట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అటు ఢిల్లీకి ఇటు ఆంధ్రాకు తాకట్టు పెట్టొద్దని కోరారు. ఇదిలావుంటే మంత్రి జోగు రామన్న సతీమణి జోగు రమాబాయి కూడా ప్రచారంలో దిగారు. ఆమె ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్‌ పార్టీని మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, ఎన్నికల హావిూలో లేని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు ఎంతో దోహద పడుతున్నాయని తెలిపారు. లోయర్‌ పెన్‌గంగా నదిపై చేపడుతున్న కొరాట-చనాక బ్యారేజీ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, తాంసి, బేల మండలాల్లో 51వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మళ్లీ కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.