చంద్రబాబు, జగన్‌ ఫ్యామిలీ గుప్పెట్లో ఏపీ

– కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారు

– కాపు రిజర్వేషన్లకు ముందు బీసీ కులాలతో లాభనష్టాలు వివరించాలి

– ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల బాధ్యత

– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

ఏలూరు,ఆగస్టు9(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ కుటుంబాలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వారిద్దరు పత్ప మరొకరు ఏలడానికి లేదా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేనాని భీమవరంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. మనమంతా మనుషులుగా ఉన్న కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేది విూరేనని, సమాజాన్ని అన్ని రకాలుగా విభజించి పాలిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు చేయాలంటే బీసీ కులాలను కూర్చొపెట్టి లాభనష్టాలు వివరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే వాడే నాయకుడు కావాలన్నారు. విూ పిల్లల భవిష్యత్తు బావుంటుందని పవన్‌ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ విూద నమ్మకం ఉంటే జనసేనకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మోసపోతున్నామని తెలిసి ఎందుకు ఓట్లు వేయాలని పవన్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల భాద్యత అని, జనసేన ప్రశ్నించడానికే పరిమితం కాదన్నారు. దశాబ్దాలుగా దెబ్బతింటున్నామంటే మనలోని అనైక్యతే కారణమని, కులాల ఐక్యత అనేది ఒక ఆశయం అన్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో సమస్యలు చాలా బలంగా ఉన్నాయని భీమవరంలో డంపింగ్‌ యార్డు లేకపోవడం ప్రధాన సమస్య అని పవన్‌ అన్నారు. ఇదిలావుంటే పవన్‌ కల్యాణ్‌ జిల్లా పర్యటన రెండో విడతలో భాగంగా బుధవారం రాత్రి భీమవరం పట్టణానికి చేరుకున్నారు. హైదరాబాదు నుంచి రహదారి మార్గంలో వచ్చారు. గత నెల 23వతేదీన వచ్చి నాలుగురోజులపాటు జిల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. మూడురోజులపాటు నిర్మలాదేవి పంక్షనుహాల్‌లో బస చేసి పలు సంఘాలతో సమావేశాలు నిర్వహించి 27వతేదీన భీమవరంలో బహిరంగ సభ నిర్వహించారు. 27వతేదీన వివిధ కార్యక్రమాల నిమిత్తం విజయవాడ వెళ్లారు. బుధవారం రాత్రి మళ్లీ భీమవరం చేరుకున్నారు. నిర్మలాదేవి పంక్షనుహాల్‌లోనే గురువారవం పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. బీసీ కులసంఘాలు, ఆటోయూనియన్లు, బ్రాహ్మణ సమాఖ్య, మేధావుల ఫోరం తదితర సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. 10వతేదీనుంచి పోరాటయాత్ర బహిరంగసభలు నిర్వహించనున్నారు. భీమవరంలో బసచేసి పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పోరాట యాత్ర నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ రోజు పర్యటించనున్నారనే షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. ఈనెల 13వతేదీ వరకు జిల్లాలో ఉంటారు. స్వాతంత్యద్రినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాదు వెళ్లనున్నారు.