చర్చనీయాంశంగా మారిన చెన్నమనేని పౌరసత్వం

మళ్లీ ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ

తుది తీర్పు కాదని వాదిస్తున్న రమేశ్‌

వేములవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబు పౌరసత్వ వివాదంపై కేంద్ర¬ంశాఖ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించిననేపథ్యంలో ఇప్పుడు తదుపరి చర్యలేమిటి అన్న చర్చ సగుతోంది. రమేష్‌బాబు పౌరసత్వం రద్దు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మరోసారి రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందా లేక గతంలో

ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ ఎమ్మెల్యే అవుతారా అన్న చర్చ కొనసాగుతోంది. వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్‌ వర్గీయులు, కాంగ్రెస్‌నాయకులు ¬ంశాఖ తీర్పుపై సంబురాలు జరుపుకున్నారు. టీఆర్‌ఎస్‌, ఎమ్మెల్యే రమేష్‌బాబు వర్గీయుల్లో ఎమ్మెల్యే సభ్యత్వంపై అయోమయం నెలకొంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్‌బాబుపై స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ నాయకుడు ఆది శ్రీనివాస్‌ ఓటమి చవిచూశారు. రమేష్‌బాబు ఎన్నిక చెల్లదని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రమేష్‌బాబు రాజీనామా చేశారు. 2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా రమేష్‌బాబు పోటీ చేశారు. వేములవాడ ఉప ఎన్నికను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను నిలిపివేసింది. టీఆర్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో హైకోర్టు మిగతా నియోజకవర్గాలతోపాటు ఎన్నికలు జరపాలని సూచించింది. దీంతో ఎన్నికల కమిషన్‌ యథావిధిగా ఎన్నికలు నిర్వహించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉప ఎన్నికల్లో రమేష్‌బాబు గెలుపొందారు. సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయాన్ని అప్పుడు తప్పుబట్టడంతో చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రమేష్‌బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్‌ పోరాటం చేస్తూనే వచ్చారు. అనేక మలుపులు తిరుగుతూ 2013లో చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వాన్ని, శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్డు రద్దు చేసింది. చెన్నమనేని రమేష్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర ¬ంశాఖ 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. ¬ంశాఖ తీసుకున్న నిర్ణయం హైకోర్టుకు చేరడంతో మరోసారి మలుపు తిరిగింది. కేంద్ర ¬ంశాఖ గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దుచేసి మరోసారి రమేష్‌బాబు పౌరసత్వంపై విచారణ చేపట్టాలని చట్ట ప్రకారంగా పరిశీలించాలని ఆదేశించింది. 12 వారాల్లో విచారణ తేల్చాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబరు 31, 2019న కేంద్ర ¬ంశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే రమేష్‌బాబు తరఫు న్యాయవాది రామారావు, కాంగ్రెస్‌ నాయకుడు ఆది శ్రీనివాస్‌ తరఫు రవికిరణ్‌రావు, రోహిత్‌రావు వాదనలు వినిపించారు. భారత పౌరసత్వం పొందే క్రమంలో రమేష్‌బాబు ఉల్లంఘించిన నిబంధనలు, చేసిన మోసాన్ని ఆది శ్రీనివాస్‌ న్యాయవాది ¬ంశాఖ ముందు ఉంచడంతో 20 రోజుల తర్వాత కేంద్ర ¬ంశాఖ రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే రమేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. కేంద్ర ¬ంశాఖ వెల్లడించిన ఉత్తర్వులపై స్పందించారు. తన పౌరసత్వాన్ని 2017లో ¬ంశాఖ రద్దు చేసిన తర్వాత వెంటనే స్టే ఇచ్చిన హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్నదని, జూలై 15, 2019న పౌరసత్వం రద్దును కొట్టి వేసిందని అన్నారు. పౌరసత్వ చట్టం, వాటి నిబంధనలు, నియమాలను, దరఖాస్తులను సమగ్రంగా, హేతుబద్ధంగా, నైతిక విలువలను, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిశీలిస్తూ చూడాలే తప్ప సాంకేతికంగా విడడీసి విశ్లేషించరాదాని, తన 25 పేజీల సుదీర్ఘ తీర్పును ప్రకటించి ¬ంశాఖ వీటినన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని అదేశించిదన్నారు. హైకోర్టు ఏ నిర్ణయం వచ్చినా మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబరు 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయని హైకోర్టు అదేశాలను ¬ంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం

శోచనీయమని అన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తానని, తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు.