చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపట్టానికి పూల మాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య….

ములుగు బ్యూరో,సెప్టెంబర్26(జనం సాక్షి):-
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ  స్పూర్తి ప్రధాయులని, వారి జీవితం ఆదర్శనీయమని జిల్లా  కలెక్టర్ ఎస్.కృష్ణ  ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ  127వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపట్టానికి  పూల మాలవేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ
తెలంగాణ వీర వనిత వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ,సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 26,1895 న జన్మించిందని తెలిపారు.
అగ్రకులాల స్త్రీలు,దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారని,ఈ భూమినాది , పండించిన పంటనాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మని ఆయన తెలిపారు. అనేక సమస్యలు ఎదుర్కొంటు నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేసిందని  కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి లక్ష్మణ్, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది,  తదితరులు పాల్గోన్నారు.