చెకుముకి టాలెంట్‌తో సృజన వెలికితీత

జనవిజ్ఞాన సమితి
చిత్తూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు చెకుముకి టాలెంట్‌ పరీక్షలు ఎంతో దోహదపడతాయని వాల్మీకిపురం మండల విద్యాశాఖ అధికారి మురళి పేర్కొన్నారు. శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక పివిసి ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి సైన్స్‌ ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మండలంలోని 6 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీష్‌ విూడియం విభాగంలో చింతపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు.  తెలుగు విూడియం విభాగంలో పివిసి హై స్కూల్‌ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు డిసెంబర్‌ 16 వ తేదీన తిరుపతిలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రభు చరణ్‌ తెలిపారు. అనంతరం పాఠశాల స్థాయి, మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం ఎంఈఓ మురళి మాట్లాడుతూ.. శాస్త్రీయ విజ్ఞానమే విద్యార్ధికి మూలధనమని, చెకుముకి టాలెంట్‌ పరీక్షలు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడతాయని, తద్వారా ఆవిష్కఅతమయ్యే పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు సువర్ణ, సుధారాణి, విద్యార్థులు, జెవివి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.