చెరువులను నింపితేనే మనుగడ

అనంతపురం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): సిఎం చంద్రబాబు హావిూమేరకు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో కాలువలను నిర్మించి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టుకు నీరందించలని సిపిఐ జిల్లా నాయకులు అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని ఉన్న అన్ని చెరువులకు నీటితో నింపాలన్నారు.     పాలకులకు సీమ కరువు పట్టడం లేదని పేర్కొన్నారు. పేరురూ, బిటి ప్రాజెక్ట్‌లకు హంద్రీనీవా ప్రధాన కాలువులతో అనుసందానం చేసి నీటి కేటాయింపులు చేయాలన్నారు. నియోజక వర్గంలో మొత్తం 120 చెరువులు ఉన్నా ఒక్క చుక్కనీరు రావడం లేదన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 120 చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలన్నారు. కళ్యాణదుర్గం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేసి, నియోజక వర్గంలోని
50వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో నీరందే విధంగా చూడాలన్నారు. తుంగభద్ర వరదనీళ్లను తీసుకొచ్చే సమాంతర కాలువ నిర్మించాలన్నారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తీ చేసి, 300 టిఎంసిల నికర జలాలను కేటాయించాలన్నారు.