చెరువుల్లో నిరంతరంగా నీరు నిల్వ ఉండాలి

ప్రతినీటి బొట్టు వినియోగం అయ్యేలా చూడాలి
జలసౌధలో అన్ని జిల్లాల ఇంజినీర్లతో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సవిూక్ష
హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ లక్ష్యానికి చెరువులో 10 నెలలు నీటి నిల్వ ఉండాలని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి నీటిబొట్టు సద్వినయోగం కావాల్సి ఉందన్నారు. వర్షపునీటని ఒడిసిపట్టి జలాశయాలను నింపడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జలసౌధలో అన్ని జిల్లాల ఇంజినీర్లతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చించారు. ఇటీవల సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షలో చేసిన సూచనల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలకు ఉప్రకమించాలని అన్నారు. కనీసం పది నెలలు నీటినిల్వ ఉండి 2 పంటలకు నీళ్లివ్వాలి. చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. చెరువులను అనుసంధానిస్తేనే లక్ష్యం సాధ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అన్ని వాగులు, వంకలు పునరుజ్జీవం కావాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలి. ఈ పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరగాలని సీఎం చెప్పారు. అని దేశ్‌పాండే వివరించారు. గొలుసుకట్టు చెరువు లసహా చిన్నచిన్న చెక్‌ డ్యా/-/-లలోనీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుకోవాలని అన్నారు.