చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

r80vkj9mచెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు. పూడిక తీసిన మట్టిని రైతులు పొలాల్లో చల్లుకోవాలని కేటీఆర్ సూచించారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న కేటీఆర్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నమని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత ఖర్చయినా రైతులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు.