చైతన్యం కలిగిన ఖమ్మం ప్రజలు పదిసీట్లను గెలిపించాలి


24 గంటల కరెంట్‌ ఇచ్చింది నిజం కాకపోతే డిపాజిట్‌ రాకుండా చేయండి
ఢిల్లీని అదుపు చేసే.. రాజకీయాన్ని టీఆర్‌ఎస్‌ చేస్తది
– ఎన్నికల తరువాత కేంద్రంలో కీలక భూమిక పోషిస్తాం
– చంద్రబాబులా తనకు చక్రంతిప్పుతా అంటూ చిల్లర మాటలురావు
– సీతారామ ప్రాజెక్టును నిలిపివేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖరాశాడు
– ప్రాజెక్టులను అడ్డుకునే పార్టీలకు ఓట్లడిగే హక్కులేదు
– అలాంటి పార్టీ అభ్యర్ధులను ప్రజలు ఐక్యంగాతరిమికొట్టండి
– ఆ పార్టీ అభ్యర్ధులను నిలదీయండి
– కాంగ్రెస్‌ నేతల అసమర్ధతతోనే రాష్ట్రం అదోగతిపాలైంది
– నాలుగేళ్లలో దేశంలోనే నెం.1 రాష్ట్రంగా అభివృద్ధి చేసుకున్నాం
– అభివృద్ధి కొనసాగించాలంటే మళ్లీ తెరాసకే పట్టం కట్టాలి
-ఖమ్మం  బహిరంగ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

ఖమ్మం,నవంబర్‌19(జ‌నంసాక్షి): చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో పదికిపది సీట్లు గెలిపించి టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో మైనస్‌ ఖమ్మం అని తాము లెక్కలు వేశామని, ఇప్పుడు మాత్రం ప్లస్‌ ఖమ్మం అని లెక్కలేస్తున్నామని చెప్పారు. మిగీ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలు బాగా చైతన్య వంతులని అన్నారు. అందువల్ల ప్రజలు కూటమి నేతలను నిలదీయాలన్నారు. 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదో గత పాలక నేతలను నిగ్గదీయాలన్నారు. తాము చెప్పింది తప్పయితే తమకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలన్నారు. జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టాలని చూస్తున్న చంద్రబాబును నిలదీయాలని కూడా పిలుపునిచ్చారు. అలాగే తాను రాసిన లేఖలకు సమాధానం చెప్పిన తరవాతనే చంద్రబాబు ఖమ్మంలో కాలు పెట్టాలన్నారు. ఇకపోతే నూటికినూరు శాతం హావిూలు అమలు చేసిన ఘతన తమ ప్రభుత్వానిదన్నారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. మోదీ నాలుగేళ్ల పాలనలో మనకు ఒరిగిందేవిూ లేదని, రాష్ట్ర అధికారాలను గుప్పిట్లో పెట్టుకొని, రాష్ట్రాలపై కర్రపెత్తనం చేయాలని చూస్తున్నారని, అలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పి రాష్ట్రాల అధికారాలను కాపాడుకొనేలా ఢిల్లీని అదుపులో పెట్టే రాజకీయాలను టీఆర్‌ఎస్‌ చేయబోతుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ఎన్‌ బీజీఎన్‌ ఆర్‌ కళాశాలలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబులాగా ఢిల్లీలో చక్రతిప్పుతా.. అది తిప్పుతా.. ఇది తిప్పుతా అంటూ నాకు చెప్పుకోవటం చేతకాదని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ తన వంతు కీలక బాధ్యత తీసుకోబుతుందని, అది విూ కల్లారా చూస్తారని కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. ఖమ్మంలో ఉద్యమ చైతన్యం బాగా ఉండేదని, రాజకీయానికి వచ్చేటప్పటికి ఖమ్మం జిల్లాలో సరియైన ఫలితాలు వచ్చేవి కావన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యూహకర్తల సమావేశంలో ఉత్తర తెలంగాణ గెలుస్తాం, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కష్టంపడాల్సి ఉందని అన్నారు. కానీ ఈ ఎన్నికల సమయంలో మాట్లాడినప్పుడు.. ఖమ్మం నుంచే విజయం మొదలవుతుందని పేర్కొన్నట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలంలో చైతన్యం ఉన్న జిల్లాలో తెరాస
అద్భుతంగా పెరిగిందన్నారు. మనం ఎవరం శాశ్వితం కాదని మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం శాశ్వితం అని ఆలోచించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను 100శాతం ఎన్నికల హావిూలను అమలు చేసిన దేశంలో ఒకేఒక్క పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ అని కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు డబుల్‌ బెడ్‌రూంలు కట్టారా అని అడుగుతున్నారని, గతంలో కాంగ్రెస్‌ ఇందిరమ్మ నాలుగు ఇళ్లకు ఇప్పుడు తెరాస ప్రభుత్వంలో కట్టిస్తున్న ఒక ఇల్లు సమానమని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 2.70లక్షల ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయని, అవి ఇంకా కొనసాగుతాయని అన్నారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత వివక్ష లేకుండా ‘కంటి వెలుగు’ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. పేదల కడుపు నింపేందుకు, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ కింది స్థాయి ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్నామన్నారు. రూ. 43వేల కోట్లతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఇప్పుడు మేధావుల్లా మాట్లాడుతున్నారని, 35ఏళ్లు సరియైన విద్యుత్‌ ఇవ్వకుండా ప్రజలు, రైతులకు నరకం చూపించారన్నారు. ప్రజలు ఓట్లు వేసేది వాస్తవాల పునాధుల విూద ఉండాలని కేసీఆర్‌ అన్నారు. కులాలు, మతాల పేరుతో ఓట్లు వేయవద్దని అన్నారు. కులం, మతం ముసుగులో ప్రజల మధ్యకు వచ్చే వారికి చెంపచెల్లు మనిపించేలా బుద్ది చెప్పాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు తుమ్మల డైనమిజంతోనే పూర్తయిందన్నారు. నేను నిధులు ఇచ్చానని, దగ్గరుండి భక్తరామదాసును పూర్తిచేయించిన వ్యక్తి, డైనమిక్‌ మంత్రి తుమ్మల అని అన్నారు. అలాంటి వ్యక్తిని మరోసారి ఆశీర్వదించాలన్నారు. గోదావరినది జిల్లాలో పారుతుందని, 150కి.విూ ఖమ్మం జిల్లా నుంచి పారుతుందన్నారు. అయినా గోదావరి నీళ్లను గత పాలకులు జిల్లాలో వినియోగించుకోలేకపోయారన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరి నీటిని జిల్లాలో పారిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య నేతల పేర్లు ప్రాజెక్టులకు పెట్టుకున్నారని, కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ఇందిర, రాజీవ్‌లు పేర్లు పెట్టి మన రాష్ట్రంలోని పోరాటయోధులను అవమానపర్చారన్నారు.
సీతారామ ప్రాజెక్టు అడ్డుకునేందుకు బాబు లేఖలు రాశాడు ..
సీతారామ ప్రాజెక్టు కట్టవద్దు, కట్టనివ్వవద్దు అని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఈ ఊరికి ప్రచారానికి వచ్చే ప్రాజెక్టును ఎందుకు అడ్డుకునేందుకు ప్రయత్నించాడో ముందు సమాధానం చెప్పిరావాలని, లేకుంటే జిల్లా ప్రజలు నిలదీయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మౌనం పాటిస్తే విూ ఇంటికి విూరే గొంతుకు బిగించుకున్నట్లేనన్నారు. జిల్లాలోని ముగ్గురు టీడీపీ అభ్యర్ధులను ఎక్కడికక్కడ నిలదీసి అడిగాలని, ఈ లెటర్‌ను వాపస్‌ తీసుకుంటారా.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తారు అని నిలదీయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మనం గొర్రెలం కాదని, సీతారాం ప్రాజెక్టులను వ్యతిరేకించే వాళ్లను తరిమికొట్టాలని అన్నారు. చంద్రబాబు నాయుడుకు నీతి, నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాసిన లేఖను విరమించుకున్న తరువాతనే ఖమ్మంలో అడుగుపెట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీగా అధ్యక్షుడిగా హెచ్చరిస్తానని కేసీఆర్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే పోడు రైతుల సమస్యను తీరుస్తానని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇసుక విూద ఆదాయం రూ.9.56కోట్లు, నాలుగేళ్ల పాలనలో రూ.2వేల57కోట్లు ఆదాయాన్ని సాధించామని కేసీఆర్‌ అన్నారు. రైతాంగానికి నేరుగా ఏ ఇబ్బంది లేకు దరఖాస్తు లేకుండా నేరుగా చెక్కులు ఇచ్చిన ప్రభుత్వం తెరాసది
అన్నారు. ప్రస్తుతం ఎకరానికి 4వేలు ఇస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తరువాత రూ.5వేలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగు బృతి, వికలాంగులకు రూ.3,016 ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. మన పథకాలను ఐక్యరాజ్య సమితి పొగుడుతుంది కానీ, కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతుబీమా కింద 2,546మందికి బీమాను అందించామన్నారు. ఎవరివద్దకు వెళ్లకుండా బీమా డబ్బులను నేరుగా అకౌంట్‌లలో వేస్తున్నామని అన్నారు. ఇండియాలో ధనిక రైతులు ఎక్కడ ఉన్నారంటే అది తెలంగాణలోనే ఉన్నారనే వరకు రైతుల పక్షాన వారికి కోసం నిలబడతానని కేసీఆర్‌ అన్నారు. రాబోయే కాలంలో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి జిల్లాలొ ఇంచుభూమినికూడా తిడిపేలా చర్యలు తీసుకుంటామని, అందుకు ముందుకు పాలేరులో తుమ్మలను, ఖమ్మంలో పువ్వాడను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.