ఛత్తీస్‌ఘడ్‌లో 62మంది నక్సల్స్‌ లొంగుబాటు

రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): చత్తీస్‌ఘడ్‌లో 62 మంది నక్సల్స్‌ పోలీసులు ముందు లొంగిపోయారు. 51 నాటు తుపాకులను కూడా వాళ్లు సరెండర్‌ చేశారు. బస్తర్‌ ఐజీ వివేకానంద సిన్హా, నారాయణ్‌పూర్‌ ఎస్పీ జితేంద్ర శుక్లాల ముందు నక్సల్స్‌ లొంగిపోయారు. చత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్‌ 12, 20వ తేదీల్లో ఎలక్షన్స్‌ ఉన్నాయి. దీంతో భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఈ దశలో నక్సల్స్‌ కొందరు పోలీసులకు లొంగిపోయారు. దాడులతో హింస చేయడం మంచిది కాదని ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు చెప్పారు. లొంగిన నక్సల్‌కు తగిన విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఆశ్రయం ఇస్తామన్నారు.