జనగామ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

ముగ్గురినీ మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎమ్మెల్సీ
జనగామ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశిస్సులు అండదండలతో జనగామ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని అందుకు సిఎం కెసిఆర్‌ నుంచి పూర్తి సహాయ సహకారాలు పొంది నిధులు విడుదలకు కృషి చేస్తున్నామని మండలి విప్‌,ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జనగామ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాను నెంబర్‌వన్‌ స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని  రుజువు చేశామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మరోమారు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి సిఎం కెసిఆర్‌ సంకల్పాన్ని ముందుకు తసీఉకుని వెళ్లేలా ఆశీర్వదించాలని అన్నారు. జనగామ, స్టేషన్‌ ఘనాపూర్‌, పాలకుర్తి అభ్యర్థలును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. జనగామ  ప్రాంతం జిల్లా కావడం,ఏడాదిలోగా కార్యాలయాలకు శంకుస్థాపనలు చేసుకోవడం,అభివృద్దిలో దూసుకుని పోయేలా గోదావరి పరవళ్లుసాగడం అంతా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జనగామ ప్రాంత ప్రజలు జిల్లా కోసం గొప్ప పోరాటం చేశారన్నారు.  అందుకే జనగామ జిల్లా అభివృద్ధిని ఒక సవాల్‌గా తీసుకొని పని చేస్తున్నామని అన్నారు.  జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం మంచి పరిణామమని అన్నారు. జడ్పీ ఛైర్మన్‌గా, ఎంపిగా పనిచేసిన తాను జనగామ జిల్లా అభివృద్దికి కూడా తనవంతుగా సహకారం అందిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం కొన్ని జిల్లాలను అడగకుండా ఇచ్చిందని, జనగామ జిల్లాను మాత్రం ఈ ప్రాంత ప్రజలు పోరాటాలతో సాధించుకున్నారన్నారు. జనగామ జిల్లా ఏర్పాటులో ప్రతి ఒక్కరూ కీలకంగా నిలిచారని అన్నారు.  జనగామ జిల్లాకు ప్రత్యేకత ఉందని, ఈ ప్రాంతం నుంచే అనేక ఉద్యమాలు
వచ్చాయని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా జిల్లాను పప్రథమంగా నిలపాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంత అభ్యర్థులను మెజార్టీతో గెలిపిస్తేనే మళ్లీ అభివృద్ది వేగంగా సాగుతుందని అన్నారు.
జిల్లాలోని  2లక్షల 86 వేల ఎకరాలకు దేవాదుల ద్వారా సాగు నీరందించబోతున్నట్లు వెల్లడించారు.  ఇక్కడ చాలా రిజర్వాయర్లు ఉన్నాయని, వాటిని దేవాదుల ద్వారా  చెరువులను నింపుతున్నామన్నారు.  పెంబర్తి, బచ్చన్నపేట, చేర్యాల, తరిగొప్పుల చెరువుల్లో ఇప్పుడు గోదావరి జలాలతో నిండుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కృషి, పట్టుదలే అని ఆయన పునరుద్ఘాటించారు.  దేవాదుల ద్వారా జనగామ జిల్లాకే ఎక్కువ లబ్ధి కలుగుతున్నదని చెప్పారు.  వ్యవసాయరంగం ప్రాధాన్యతను గుర్తించి రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు ఎకరానికి ఏటా రెండు పంటలకు రూ. 8వేలు పెట్టుబడి అందించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని, దీనికోసం రైతు సమన్వయ సమితిలు వేసి రైతులకు ఖాతాలు ఓపెన్‌ చేసి నేరుగా వారి అకౌంట్లోని డబ్బులు జమ చేస్తామన్నారు. జనగామను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చడంలో భాగంగా జిల్లాలో మెడికల్‌ కళాశాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. తెలంగాణ వస్తే కరెంట్‌ కష్టాలొస్తాయని సమైక్యవాదులు భ యపెట్టారని గుర్తుచేశారు.  24 గంటల కరెంట్‌ను ఇస్తుంటే విపక్షాలకు పాలుపోవడం లేదన్నారు. అందుకే వారు ఏవేవో కారణాలతో విమర్శలు చేస్తున్నారని అన్నారు.