*జయప్రదం అయిన డాన్ టు డస్క్ కార్యక్రమాలు* *నాగర్ కర్నూలు వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్*

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆదేశానుసారంగా రెండు రోజులు డాన్ టు డస్క్ (DAWN TO DUSK ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే) కార్యక్రమాలలో భాగంగా నాగర్ కర్నూల్ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో శ్రీపురం,నాగర్ కర్నూల్,మేడిపూర్,పెద్దకొత్తపల్లి గ్రామాలలో అనేక కార్యక్రమాలు జయప్రదంగా చేశామని నాగర్ కర్నూల్ వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె  సాయిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 9గంటలకు శ్రీపురం శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం క్రింద కనబరచిన కార్యక్రమాలు,నాగర్ కర్నూలు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది.శ్రీపురం ఉన్నత పాఠశాలకు-నోట్ బుక్కులు మరియు డిక్షనరీలు నాగర్ కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాలకు-స్పీకర్ మేడిపూర్ ప్రాథమిక పాఠశాలకు-మిని మైక్ సెట్
పెద్దకొత్తపల్లిలో వికలాంగులకు ఒక రోజు భోజనం మరియు కొంత ఆర్థిక సహాయం చేయడం.పై కార్యక్రమాలతో పాటు తరువాత జినుకుంట,జ్ఞానేశ్వర వాత్సల్య మందిర్,ఆకునెల్లికుదురు లలో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.డాన్ టు డస్కు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దొంతు.పాండురంగయ్మ మాట్లాడుతూ,ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో-విద్య మరియు వైద్యం కార్యక్రమాలతో పాటు ఇలాంటీ అనేక కార్యక్రమాలు చేస్తూ,2013 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ-వాసవి క్లబ్ అని మరియు ప్రతి రోజు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో కనీసం నాలుగు కోట్ల ఖర్చు అయ్యే కార్యక్రమాలు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో చేస్తామని”అన్నారు.ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథి దొంతు. పాండురంగయ్య,మరో అతిథి పూరి.సురేష్,రీజియన్ చైర్మన్ గందం.ప్రసాద్,వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె.సాయిశంకర్,కండె.సుద,కార్యదర్శులు చిగుళ్లపల్లి.రమణకుమార్,చిగుళ్లపల్లి.జ్యోతి,కోశాధికారులు కంచర్ల.శ్యాంసుందర్,కంచర్ల.సంపూర్ణ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.