జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచిన మానవతా మూర్తి హరీష రావు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( జులై 30)
ఇటీవల కొండపాక  విలేకరి హనుమంత రావు ఆర్థిక సమస్యల తో,నమ్మినవారు మోసం చేయడంతో కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మెదక్ సిద్ధిపేట జిల్లాలకు చెందిన ముగ్గురు విలేకరులు గుండెపోటుతో మృతి చెందారు..దుబ్బాక కు చెందిన వెంకటస్వామి గౌడ్,టేక్మాల్ కు చెందిన శ్రీనివాస్,చిన్నశంకరం పేటకు చెందిన సిద్ధులు లు ఒకే రోజు మృతిచెందిన ఘటనతో మంత్రి హరీష్ రావు  తీవ్రంగా చలించి పోయారు..హనుమంతరావు కుటుంబ సభ్యులకు చనిపోయిన రోజున 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాద్వారా అందించారు.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటానని  ఎవరినీ అధైర్య పడవద్దని చెప్పారు..చనిపోయిన జర్నలిస్టులకుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని భావించారు..ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి జర్నలిస్టు సంఘం పక్షాన కోరిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చనిపోయిన జర్నలిస్టుల 4 కుటుంబాలకు  ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఇస్తానని ఆ కుటుంబ సభ్యులను పిలిపించాలని చెప్పారు..అందులో భాగంగా ఆదివారం హనుమంతరావు,వెంకటస్వామి,టేక్మాల్ శ్రీనివాస్, చిన్నశంకరం పేట సిద్ధులు కుటుంబాలను సిద్ధిపేటలోని మంత్రి హరీష్ రావు ఇంటికి పిలిపించి ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం  మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు నేను మృతుల కుటుంబాలకు అందజేయడం జరిగింది..ఈ సందగర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో చనిపోయిన ఇతర జర్నలిస్టు కుటుంబాలను కూడా త్వరలో ప్రభుత్వం పక్షాన ఆదుకుంటానని చెప్పారు.. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో,సిద్ధిపేట జిల్లా పరిధిలో జర్నలిస్టు లకు ఏ సమస్య వచ్చినా వెంటనే  ఆదుకుంటూ మంత్రి హరీష్ రావు ఎంతో మంది జర్నలిస్టు లకు అండగా నిలిచారు.. జర్నలిస్టు లకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మంత్రిగారి దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో  తన PA వెంకటేశ్వర్ రావు ను ప్రత్యేకంగా పంపించి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు..జర్నలిస్టు ల కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన వెంటనే స్పందించి ఆదుకున్నారు..రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిద్ధిపేటకు చెందిన ఇద్దరు జర్నలిస్టు లకు ఆయన దృష్టికి తీసుకు పోయిన వెంటనే స్పందించి అర్ధరాత్రి యశోద ఆసుపత్రి వారితో మాట్లాడి చికిత్స చేయించి పునర్జన్మ నిచ్చారు..200 మంది జర్నలిస్టు లకు సిద్దిపేటలో ఇండ్ల స్థలాలు ఇప్పించారు.. ఫోన్ లో పంపిన మెస్సేజ్ లకు తక్షణమే స్పందించి ఎంతో మంది జర్నలిస్టు లకు అండగా నిలిచారు..పిలిస్తే పలికే స్వంత అన్న లా జర్నలిస్టు ల కుటుంబాలకు అండగా ఉంటున్న మంత్రి హరీష్ రావు కు టి యూ డబ్ల్యు    ఐ జె యూ  సిద్ధిపేట జిల్లా పక్షాన జిల్లా జర్నలిస్టు లందరి పక్షాన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే  ఐ జె యూ సంగారెడ్డి జిల్లా   అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, సిద్ధిపేట జిల్లా నాయకులు రాజిరెడ్డి, యాదవరెడ్డి,  బబ్బూరి రాజు,కాల్వ లింగం, అంబటి వెంకటి,ఇంగు శివకుమార్,రాజమల్లు, మజ్జు,సాజిద్,జీకురు పరమేశ్వర్, రాంరెడ్డి,గిరి,రామాచారీ,శ్రీనాథ్, రమేష్,బాబూరావు,వికాస్, వంశీధర్  యూనిస్ ,రామకృష్ణ     ,దుబ్బాక సిద్ధిపేట కు చెందిన పలువురు జర్నలిస్టు లు పాల్గొన్నారు..