జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి):

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో నిర్వహించే జిల్లాస్థాయి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాట్లను శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, డిఈవో గోవిందరాజులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….జిల్లా కేంద్రంలో నిర్వహించే జానపద కళాకారుల ప్రదర్శనకు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్,ఇతర అధికారులు హాజరవుతారన్నారు. జిల్లాస్థాయిలో 18 జానపద ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఈనెల 14వ తేదీ ఆదివారం నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాల్లో మండలాల స్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్సైల ఆధ్వర్యంలో జానపద కళాకారుల ప్రదర్శనను నిర్వహించాలని,నియోజకవర్గాల స్థాయిలో ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, తెలంగాణ సంస్కృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గస్థాయిలో జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.ఆయా స్థాయిలో జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలకు ఆయా స్థాయిల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు.
ఎస్ జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు వారి వెంట ఉన్నారు.