జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత

అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతన్నాయి.  జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. చలికాలం ముగుస్తుండడంతో ఎండాకాలం ప్రభావం ప్రారంభమైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏటా ఎండాకాలంలో రాష్ట్రంలో మిగితా జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా యి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. శనివారం 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.జిల్లా వ్యాప్తంగా ఎండాకాలం ప్రభావం అప్పు డే ప్రారంభమైంది.  జిల్లాలో గురువారం 35 డిగ్రీలు, శుక్రవారం 36.5 డిగ్రీలు, శనివారం 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.  38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డయ్యాయి. పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తలకు టోపీలు పెట్టుకోవడంతో పాటు వేడి గాలి తగలకుండా కర్చిఫ్‌లు కట్టుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తుండగా సాయంత్రం ఆరున్నర గంటలకు చీకటి పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఎండ, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఫ్యాన్లును వాడుతున్నారు. చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లను వినియోగిస్తున్నా రు. ఎండ ప్రభావం తగలకుండా ప్రజలు చల్లటి పదార్థాలు, తర్బుజా పండ్లు, కొబ్బరి బొండాలు వినియోగిస్తున్నారు. గత ఏడాది గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సీజన్‌ ప్రారంభంలో ఎండలు మండిపోతుండడంతో రాబోయే రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉండనుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.