జిల్లా గ్రంథాలయాన్ని..  డిజిటలైజేషన్‌ చేస్తాం 


– నిరుపేద విద్యార్థుల చదువులకు గ్రంథాలయాలు వేదికలు కావాలి
– 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మంత్రి కమలాకర్‌
కరీంనగర్‌, నవంబర్‌14 (జనంసాక్షి)  : జిల్లా గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌ చేస్తామని, ఇందుకు సంబంధించి నిధులను స్మార్ట్‌ సిటీ నిధుల్లో కేటాయిస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కరీంనగర్‌ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయంను డిజిటలైజేషన్‌ చేస్తామని అన్నారు. స్మార్ట్‌ పథకంలో నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చారు. గతంలో పురాతన బిల్డింగ్‌ వుండేవని ఇప్పడు అధునాతన బిల్డింగ్‌ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గర్వంగా తెలిపారు. నిరుపేద విద్యార్థులకు గ్రంథాలయం ఒక వరం మని అన్నారు. గ్రంథాలయం ఉంటే పుస్తకాలు కొనుక్కునే పని ఉండదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎమ్‌ఎఫ్‌ టీ నిధుల నుండి రూ.50లక్షలు కేటాయించామని అన్నారు. నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ఎక్కడ చదువుకొని ఉద్యోగులు సాధించారని అన్నారు. గ్రంథాలయాన్ని త్వరలో డిగిటిలైజే చేస్తామని, దానికి అవసరమైన నిధులను స్మార్ట్‌ సిటీ నిధుల్లో కేటాయిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామని, అంతేకాకుండా నిరుపేద గ్రావిూణ విద్యార్థుల చదువులకు వేదిక గ్రంథాలయం కావాలని ఆయన కోరారు. గ్రావిూణ విద్యార్థులకు కడుపునిండా భోజనం చేసేందుకు త్వరలో రూ. 5 భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.