జులై 1 నుంచి ఓటర్ల నమోదు

వచ్చే నెల (జులై) 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఓటరు నమోదులో తొలిసారి జీపీఎస్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర ఓటర్ల నమోదుకు 3,879 బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ల నమోదుకు 392 మంది పర్యవేక్షకులను నియమిస్తామన్నారు. ఓటర్ల నమోదుకు తొలిసారి ట్యాబ్‌ల ద్వారా జీపీఎస్‌తో అనుసంధానం చేస్తామన్నారు. ఓటరు గుర్తింపు కార్డులు కలర్‌లో అందిస్తామని..  వీటిని జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో రూ. 25 చెల్లించి పొందవచ్చని తెలిపారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల హద్దుల నిర్ధారణ జరుగుతుందన్నారు.