జూరాలతో తీరనున్న నీటి సమస్యలు

పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు
మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద నీరు రావడంతో తొలిసారిగా 750 క్యూసెక్కుల వరద నీటిని మొదటి పంపు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులుగా కాల్వల్లోకి నీరు తుమిళ్ల వెలుతుంది. తొలిసారిగా సాగు నీరు వస్తున్న సందర్భంగా రైతులు అనందంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు సామార్థ్యం 9.66 టీఎంసీలు కాగా, కుడి, ఎడమ కాల్వలతో పాటు సమాంతరం కాల్వలతో సాగునీటిని అందిస్తుంది. ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా 1, 2 ఎత్తిపోతల పథకానికి అవసర మైన నీటిని అందిస్తుంది. జూరాల కింద మొత్తం ఆరు లక్షల ఎకరాల భూములు సాగవుతున్నాయి. తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్‌ కాల్వల ద్వారా సాగునీరు అందించడానికి అవకాశం ఉండేది. జిల్లాలోని పత్తి, వరి, వేరుశేనగ, అము దం, మిరప, ఉల్లి పంటలను సాగు చేశారని వ్య వసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు నె/-టటెంపాడు కింద వరద నీటితో కొద్దిపాటిగా పంటలు మునిగిన నష్టం పెద్దగా జరగలేదు. ప్రాజెక్టులోకి సాగునీరు రావడంతో ఖరీఫ్‌తోపాటు రబీ పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. జూరాల కింద నె/-టటెంపాడు ఎత్తిపోతల పధకం ఉంది. నాలుగు పంపుల నుంచి 2,800 క్యూసెక్కుల వరద నీరు తీసుకునే అవకాశం ఉంది. నెట్టెంపాడు నుంచి ర్యాలంపాడు నీటిని పంపిస్తారు. నాలుగు టీఎంసీల సామర్థ్యం కలిగిన ర్యాలంపాడు నుంచి గట్టు, మల్దకల్‌, దరూర్‌, కేటీదొడ్డి మండలాలకు సాగునీరు అందుతుంది. జూరాల కుడి కాల్వ ద్వారా గద్వాల, ఇటిక్యాల మండలాలకు సా గునీరు అందుతుంది. ఈ సారి వరద నీరు ఎ క్కువ కాలం వస్తుండడంతో రెండు పంటలకు సాగు నీరు అందే అవకాశం ఉంది.  ప్రభుత్వం గత సంవత్సరం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీరిచ్చింది.