.టాటా విరాళం

టాటా సన్స్‌ రూ.1000 కోట్లు, టాటా ట్రస్ట్‌ రూ.500 కోట్లు విరాళం
` సినీనటుడు అక్షయ్‌కుమార్‌ రూ.25 కోట్లు…బీసీసీఐ రూ.51 కోట్లు అందజేత
ఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):కరోనా మహమ్మారిపై సమరానికి టాటా సన్స్‌ రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మధ్యాహ్నమే టాటా ట్రస్ట్‌ తరఫున రూ.500 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా టాటా గ్రూప్‌ తరఫున కరోనాపై పోరాటానికి విరాళం రూ.1500 కోట్లకు చేరింది. ప్రస్తుతం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అత్యవసర చర్యు అవసరమని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా అన్నారు.
ముంబై: మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు తీసుకుంటున్న చర్యకు మద్దతుగా విరాళాు మ్లెవెత్తుతున్నాయి. పువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖు సహాయ నిధుకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్‌ రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. టాటా ట్రస్ట్‌, టాటా గ్రూప్‌ కంపెనీ తరఫున రూ. 500 కోట్లను కేటాయించినట్లు టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా వ్లెడిరచారు. కోవిడ్‌`19 సంక్షోభ పరిస్థితును ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర వనరును సమకూర్చుకోవసిన అవసరం ఉందని ఛైర్మన్‌ రతన్‌ టాటా చెప్పారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ గతంలో కన్నా ఎక్కువగా మద్దతుగా నివాల్సి ఉందని రతన్‌ టాటా ట్వీట్‌ చేశారు. ఈ నిధును వైద్యుకు అవసరమైన పీపీఈు, కరోనా కేసు పెరిగితే చికిత్స కోసం వినియోగించే శ్వాససంబంధ పరికరాు, టెస్టింగ్‌ కిట్ల కొనుగోు, హెల్త్‌ వర్కర్ల శిక్షణ కోసం ఉపయోగిస్తామన్నారు.
పీఎం కేర్స్‌ నిధికి బీసీసీఐ రూ.51కోట్ల విరాళం
కరోనాపై పోరాడేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం`కేర్స్‌ నిధికి రూ.51కోట్లు అందించనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ‘‘దేశ విపత్తు నిర్వహణను బలోపేతం చేయడానికి, కొవిడ్‌ `19 పరిశోధనను చేసేందుకు, దేశ ప్రజను రక్షించేందుకు ప్రధాని ప్రారంభించిన పీఎం`కేర్స్‌ నిధికి బీసీసీఐ రూ.51కోట్ల విరాళాన్ని ఇవ్వనుంది. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జైషా, ఆఫీస్‌ బేరర్లు, అనుబంధ సంఘాు కలిపి దీన్ని అందజేయనున్నాయి. బోర్డు, రాష్ట్ర సంఘాు కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాు, సంబంధిత శాఖను సంప్రదిస్తూ అవసరమైన మద్దుతును అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
పీఎం`కేర్స్‌ ఫండ్‌కి అక్షయ్‌ భారీ విరాళం!
ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వానికి తనవంతు ఆర్థిక సహాయం చేశారు. పీఎం`కేర్స్‌ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఇది మన ప్రజ ప్రాణాకు సంబంధించిన విషయం. అవసరమైతే దీని కోసం మనం ఏదైనా, ఎలాంటిదైనా చేయాలి. నా సొంత డబ్బు నుంచి రూ.25 కోట్లు పీఎం`కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని ప్రమాణం చేస్తున్నా. జీవితాల్ని కాపాడుదాం.. ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.అక్షయ్‌ పట్ల చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన సతీమణి ట్వింకిల్‌ ఖన్నా ట్వీట్‌ చేశారు. ‘ఇతడు నేను గర్వించేలా చేస్తున్నాడు. ఇంత భారీ మొత్తం ఇస్తున్నావు, ఆలోచించావా? అని నేను అడిగినప్పుడు.. ‘ప్రారంభంలో నా వద్ద ఏవిూ లేదు.. కానీ ఇప్పుడు ఇచ్చే స్థాయిలో ఉన్నా. ఏవిూ లేని పేద కోసం నేను చేయగలిగినది కూడా చేయకుండా ఎలా ఉండగను’ అని చెప్పాడు’ అని ఆమె పోస్ట్‌ చేశారు.దీంతో అక్షయ్‌పై నెటిజన్లు ప్రశంస జ్లు కురిపిస్తున్నారు. ‘గ్రేట్‌ సర్‌.. విూకు స్యోట్‌ చేస్తున్నా.. గొప్ప మనసు, రూ.25 కోట్లు విరాళం ఇస్తున్నారు.. విూ పట్ల చాలా గర్వంగా ఉంది అక్షయ్‌, హ్యాట్సాఫ్‌, వ్‌యూ..’ అంటూ రకరకా కామెంట్లు చేస్తున్నారు. పీఎం`కేర్స్‌ ఫండ్‌ చిన్న విరాళాల్ని కూడా స్వీకరిస్తుందని మోదీ ట్వీట్‌ చేశారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజ ఆరోగ్యాు కాపాడేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
భాజపా ప్రజాప్రతినిధు విరాళం!
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సమరానికి తన వంతుగా సహకారం అందిస్తున్నట్టు భాజపా ప్రకటించింది. భాజపాకు చెందిన ఎంపీంతా తమ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్థి పథకం (ఎంపీ ల్యాడ్స్‌) నిధు నుంచి ఒక్కో రూ. కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తున్నట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్లెడిరచారు. అలాగే, తమ పార్టీకి చెందిన అందరు ఎంపీు, ఎమ్మెల్యేంతా తమ ఒక నె జీతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తారని ఆయన తెలిపారు
గవర్నర్‌ తమిళి సై విరాళం
కరోనా నియంత్రణ చర్యకు తెంగాణ గవర్నర్‌ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించారు. సీఎం సహాయ నిధికి తన నె జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విరాళం చెక్కును సీఎం కేసీఆర్‌కు పంపించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనాపై యుద్ధంలో కలిసి నడుస్తానని తమిళి సై తెలిపారు.
సన్‌ఫార్మా చేయూత
కరోనా(కొవిడ్‌`19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్‌ చేస్తున్న పోరులో భాగమయ్యేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా ముందుకు వచ్చింది. రూ.25 కోట్ల మివ చేసే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌(హెచ్‌సీక్యూఎస్‌), అజిత్రోమైసిన్‌ సహా ఇతర మందు, శానిటైజర్లను విరాళంగా అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.