టిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం సాధ్యం

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: లోక
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27: వివిధ పరిశ్రమల అభివృద్దికి సిఎం కెసిఆర్‌ తీసుకుంటునన చర్యల కారణంగా రాష్ట్రంలో గ్రావిూణ ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడగలదని పాడి సమాఖ్య చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. ఇంటికో బర్రె పథకం ద్వారా పాడి ఉత్పత్తి పెరగగలదన్నారు. పాడి ద్వారా రైతులు ఆర్థకంగా బలపడగలరని అన్నారు. ఇప్పటికే గొర్రెల పెంపకం, మత్స్యకారులకు చేయూత కార్యక్రమాలతో గ్రామాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వందశాతం రాయితీపై నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో గతేడాది 20 కోట్ల చేప పిల్లలను వదిలితే ఈ సారి 70 కోట్లు వదలుతున్నామన్నారు. గంగపుత్రులు సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో సొసైటీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో పది మత్స్య సహకార సంఘాల భవనాలకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇన్ని చ ఏసిన టిఆర్‌ఎస్‌ను గెలిపించి ఆదరించాలన్నారు. టిఆర్‌ఎస్‌ గెలుపుతోనే ప్రగతి సాధ్యమని అన్నారు.