టిటిడి ఛైర్మన్‌ పదవి వార్తల్లో నిజంలేదు: రాఘవేంద్రరావు

హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తితిదే ఛైర్మన్‌గా తాను బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో

నిజం లేదని ప్రముఖ దర్శకుడు, తితిదే బోర్డు మాజీ సభ్యుడు కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. తితిదే ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు బాధ్యతలు చేపడుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్‌విూడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను ఆయన గురువారం కొట్టిపారేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. గత రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో, సోషల్‌ విూడియాలో రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సన్నిహితులు అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయంపై బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఎస్వీఎస్సీ ఛానల్‌ ద్వారా స్వామివారి సేవ చేస్తున్నానని.. మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరిస్తూ స్వామి సేవలో తరలించాలన్నదే తన కోరిక అని దర్శకేంద్రుడు స్పష్టం చేశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నానని వార్తలు వస్తుండడంతో వేలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. ఎస్వీఎస్సీ ఛానెల్‌ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నాను. శ్రీవారికి చెందిన కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది నా కోరిక.’ అని దర్శకేంద్రుడు ట్వీట్‌ చేశారు.

/ూఘవేంద్రరావు వెంకటేశ్వరస్వామి నేపథ్యంలో ‘అన్నమయ్య’, ‘నమో వేంకటేశాయ’ చిత్రాలు తెరకెక్కించిన విషయం విదితమే.