టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

నిరంజన్‌ రెడ్డి
వనపర్తి,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దైవమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి
అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు పంట పెట్టుబడి పథకం రైతు బందును ప్రవేశ పెట్టి ఎకరానికి రూ.8 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు రైతుకు రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించి దేశంలోనే కేసీఆఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్‌ రైతుల కోసం దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాలను ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేసినట్లు చెప్పారు. రైతులకు గతంలో రూ.లక్ష రుణమాఫిని దశల వారీగా అమలు చేశాడని ఆయన గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్స్‌ తదితర పథకాలతో ఆడబిడ్డలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ పనులు జరిగాయన్నారు. మిషన్‌ భగీరథ పథకం ప్రవేశ పెట్టి ఇంటింటికి తాగునీటి కోసం శుద్ధమైన గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేసీఆర్‌ కలలు కన్న బంగారు తెలంగాణ సిద్ధించాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌నే సీఎంను గెలిపించుకోవాలని కోరారు.