టీచర్లను అడ్‌జ్ట్‌ చేయండి: ఆర్జెడి ఆదేశాలు

హైదరాబాద్‌,జూలై18(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి అయిన తర్వాత పలు పాఠశాలల్లో టీచర్లు లేకుండా పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులను.. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించాలని ఆర్జేడీ, డీఈవోలకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రైమరీ స్కూల్‌లో ఒకరు, అప్పర్‌ ప్రైమరీలో ఇద్దరు, హైస్కూల్‌లో ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా త్వరగా ఈ పక్రియ పూర్తి చేయాలని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాలిచ్చారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాల్లలో వెంటనే చేరేలా చూడాలన్నారు.