టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’


– రాష్ట్ర ప్రజల డేటామొత్తం బయటకెళ్లింది
– ఇదిచాలా ప్రమాదకరం విషయం
– వైసీపీ ఓట్ల తొలగింపు కోసమే ఇలాంటి చర్యలకు టీడీపీ దిగింది
– ఐటీ గ్రిడ్‌, బ్లూ ఫ్రాగ్‌ కంపెనీల ఓనర్లు ఎప్పుడూ బాబు వెంటే ఉంటారు
– ఈ డేటా చోరీపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందే
– వైసీపీ పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’ అని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డేటా ఓట్ల తొలగింపు, ఐటి గ్రిడ్‌ చోరిపై కనీస అవగాహన లేకుండా మంత్రులు, పయ్యావుల కేశవ మాటాడుతున్నారన్నారు. ఇది రాజకీయంగా చూడకుండా సామాన్యల గురించి ఆలోచించండన్నారు. ఏపీకి ఏదో జరిగిపోతుందని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని, ఏం జరిగిందో వాళ్లకు తెలియదన్నారు. తెలిస్తే వాళ్ళు అలా మాట్లాడారన్నారు. సమాచార గోప్యత అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని, ఆందప్రదేశ్‌ కోట్ల ప్రజల సమాచారం బయటకు వెళ్ళిపోయిందని,, యూఐడి నెంబర్‌ కూడా బయటకు వచ్చేసిందన్నారు. ఇది చాలా ప్రమాదకరం అని రాజేంద్ర నాథ్‌ రెడ్డి అన్నారు. బ్లూ ఫ్రాగ్‌, ఐటీ గ్రిడ్‌ కంపెనీకి సంబంధించిన యజమానులు ఎప్పుడు చూసినా సీఎం చంద్రబాబు దగ్గర ఉంటారని విమర్శించారు. ఓట్లును నాలుగు భాగాలుగా చేశారని, ప్రజాసాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారం సేకరించారన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ కు తెలియకుండా ఓటర్ల లిస్ట్‌ సేకరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన పౌరుల సమాచారం ప్రైవేటు సంస్థలకు ఏ విధంగా వెళ్లిందని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లిందన్నారు. ఈ సమాచారం అంతా ప్రగతి కోసం అని మంత్రి లోకేష్‌ అంటున్నారనీ, వైసీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపు కూడా వీరి కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.
‘గతంలో ప్రభుత్వ టీచర్లు ఓటర్‌ నమోదు, తొలగింపు చేసేవారని, కాని ప్రస్తుతం అంగన్‌వాడిల ద్వారా చేయిస్తున్నారన్నారు. వాళ్లు జన్మభూమి కమిటీ సభ్యుల ఒత్తిడికి లొంగి పనిచేస్తుంటారని, రాష్ట్ర ప్రజల సమాచారాన్ని డేటాహబ్‌లో పెట్టారన్నారు. చట్ట ప్రకారం ఎక్కడ నేరం జరిగితే అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని, కానీ విూరు మాత్రం హైదరాబాద్‌లో నేరం జరిగినా ఏపీలోనే దర్యాప్తు చేస్తానంటారని బూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల లిస్ట్‌ నుంచి విూకు నచ్చని ఓటర్లను తొలగించేందుకు యంత్రాంగం తయారు చేశారని, విచారణ జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 30 కోట్ల రూపాయలకు పంటలకు సంబంధించి ఓ కాంట్రాక్టు ఆ సంస్థకు ఇచ్చారని,  2014 ముందు ఐటీగ్రిడ్‌ ఎప్పుడైనా వ్యాపారం చేయ్యలేదని, విూ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైనా కంపెనీ అని బుగ్గన ఆరోపించారు. విూ కోసమే ఇది ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోందని, డేటా చోరీ విషయం బయటకు రాగానే యాప్‌ నుంచి డేటా ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. సేవామిత్ర యాప్‌ డౌన్‌ లోడ్‌ చేస్కున్న ప్రతి ఒక్కరి డేటా ఐటీగ్రిడ్స్‌ వద్ద ఉందని, ప్రతి ఒక్కరి ఫోన్‌ నెంబర్లు, బ్యాంక్‌ అకౌంట్స్‌ ఐటీగ్రిడ్స్‌ వద్ద ఉన్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. సేవామిత్ర యాప్‌ లోకి కలర్‌ ఫోటోలు ఎలా వెళ్లాయని, ఐటీగ్రిడ్‌ కుంభకోణంపై ఆధార్‌ సంస్ధ, ఎన్నికల కవిూషన్‌, సైబర్‌ కైమ్ర్‌ పోలీసు విచారణలు జరపాల్సిందేని బుగ్గన పేర్కొన్నారు.