టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే.. 

వైసీపీ ఎంపీలు ఇంట్లో పడుకున్నారు
– వైసీపీ, బీజేపీకి మధ్య లాలూచీకి ఇదే నిదర్శనం
– వైసీపీ ఎంపీలే  జగన్‌ను అసహ్యించుకుంటున్నారు
– ¬దాకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతాం
– విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, జులై21(జ‌నం సాక్షి) : బీజేపీతో యుద్ధమంటూనే టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలు ఎవరివో జగన్‌ మాటలు వింటుంటే అర్థమవుతోందన్నారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలే జగన్‌ను అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు. ‘పార్లమెంట్‌కు రారు.. అసెంబ్లీకి రారు.. ఇక ఎక్కడ మాట్లాడుతారో వైసీపీ నేతలనే అడగాలని మంత్రి ఎద్దేవా చేశారు.
రాజీనామాలతో పలాయనవాదం బయటపడిందని విమర్శించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతుంటే వైసీపీ నేతలు ఇంట్లో పడుకున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం, మొండి వైఖరి అవలంబిస్తోందని, ప్రధాని మోదీ అహంకారంతో మాట్లాడారని అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో అన్ని పార్టీలు తమ బాధలు చెప్పుకుంటే… జగన్‌ మాత్రం జారుకున్నారంటూ మండిపడ్డారు. ఐదు ఎంపీ సీట్లు చేతిలో ఉంచుకుని కూడా… వైఎస్‌ జగన్‌ ఏవిూ చేయకుండా తప్పుకోవడం చీకటి ఒప్పందం కాదా అని దేవినేని ప్రశ్నించారు. అవినీతి, కుంభకోణాలు, కుమ్మక్కు రాజకీయాలంటూ జగన్‌ మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ¬దా సాధిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతామని, ఏపీకి మోదీ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.