టీవీ సీరియల్స్‌పై సెన్సార్‌ విధించాలి

ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తా
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని
గుంటూరు, జూన్‌14(జ‌నం సాక్షి) : హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్‌ పై సెన్సార్‌ విధించాంటూ కోర్టుకు వెళ్తానని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.. ప్రస్తుతం సీరియల్స్‌లో కుట్రపూరిత దృశ్యాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఫలితంగా మహిళల్లో క్రూరత్వం పెరుగుతుందని, తద్వారా చక్కటి కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అదేవిధంగా ఈ విషయంపై ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్‌ విూడియాల్లో అశ్లీల దృశ్యాన్ని నిరోధించడానికి కృషిచేస్తామని ఆమె హావిూ ఇచ్చారు. మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.