టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావడానికి కృషి చేయాలని డిఇవో అన్నారు. పది పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో లేదనే అపోహ తొలగించాలన్నారు. ఈ ఏడాదైనా మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఉత్తీర్ణ త కోసం ప్రత్యేకంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళలో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి నిలిపి వారు కూడా ఉత్తీర్ణులయ్యేలా చూస్తున్నా మన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని డిఇవో అన్నారు. పరీక్షలకు  కొన్ని రోజుల వ్యవధి ఉందని, ఈ నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించడం కష్టమేమి కాదన్నారు. విద్యార్థులు లాంగ్వేజ్‌లు, గణితంలో చాలా వెనుకబడి ఉన్నారని, దీనిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని  ప్రధానో పాధ్యాయులకు సూచించారు. రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు తీసుకురాలన్నారు. విద్యార్థులు పూర్తిగా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని అయిన ఫలితాల్లో వెనుకబడి ఉండడం విస్మయం కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.