టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో వచ్చే నెల  ప్రారంభం కానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు
ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి  తెలిపారు. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు సిబ్బంది నియామకాలు ప్రారంభం అయ్యాయన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జరగనున్న సవిూక్ష తరువాత పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామన్నారు. వంద రోజుల ప్రణాళిక ముగింపు దశకు చేరిందని, ప్రతిరోజూ రెండు గంటల అదనపు తరగతులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. గత ఏడాది పదోతరగతి
ఫలితాల్లో జిల్లా 94.7శాతంతో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకులో నిలిచిందన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఫలితాలు పెంచడానికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే వీరికి నిపుణులతో నూతన విధానంలో తయారు చేయించిన మోడల్‌ పేపర్లు అందజేశామన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఫ్గ్రీ/నైల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.జిల్లాలో మొత్తం 250 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. మార్చి నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్‌ నమోదు యంత్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.