టెన్త్‌ విద్యార్థుల సన్నద్దతకు కృషి

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): విద్యార్థుల భవితకు పదో తరగతి నాందిగా నిలుస్తుంది. దీంతో అధికారులు ఇప్పటి నుంచే వారికి తర్ఫీదు ఇస్తున్నారు.  మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అరూరి గట్టుమల్లు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. పేద పిల్లల చదువును సామాజిక బాధ్యతగా తీసుకొని నియోజకవర్గంలోని ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన బడి మన బాధ్యత పేరిట గత నాలుగేళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు మందు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేస్తున్నట్లుగా ఆయన వివరించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. మండలంలోని 9 ప్రభుత్వం పాఠశాలల్లో టెన్త్‌ చదువుతున్న విద్యార్థులు 281 మందికి అల్పాహారం కోసం ఒక్కొక్కరికి రోజుకు రూ. 5ల చొప్పున నెల రోజులకు మొత్తంగా రూ. 42,150 నగదును ఎమ్మెల్యే రమేశ్‌ అరూరి గట్టుమల్లు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అందజేసారు.