టోఫెల్‌ పరీక్ష హ్యాకింగ్‌ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌, ఆగస్టు 30: నగరంలో టోఫెల్‌ పరీక్ష హ్యాకింగ్‌ ముఠా గుట్టురట్టయింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి-టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ముఠా అడ్డంగా దొరికిపోయింది. విశ్వసనీయ సమాచారంతో ముఠాపై దృష్టి పెట్టిన పోలీసులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహకారంతో ముఠాను పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షను హ్యాక్‌ చేసి పరీక్ష రాయిస్తున్న ముఠా..ఒక్కో విద్యార్థి నుంచి రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తోంది. మొత్తం 78 సర్వర్లను హ్యాక్‌చేసిన ముఠా సభ్యులు పరీక్షాపత్రంలోని ప్రశ్నలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి ముఠాలోని ఐదుగురు సభ్యలను పట్టుకున్నారు.