గుజరాత్‌ను చిత్తు చేసిన కోల్‌కతా

టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టిస్తూ.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చెలరేగిపోయింది. క్రిస్ లిన్ 41 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్ గా, గంభీర్ 48 బంతుల్లో 76పరుగుల వరద పారించడంతో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. సురేశ్ రైనా 68 పరుగులతో నాటౌట్, దినేశ్ కార్తీక్ పరుగులు 47 పరుగులు, మెకల్లమ్ 35 పరుగులతో దుమ్మురేపావు. తర్వాత కోల్‌కతా 14.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 184 పరుగులు చేసింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు గంభీర్, క్రిస్‌లిన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా లిన్.. కొడితే సిక్స్ లేదంటే బౌండరీ తరహాలో విధ్వంసం సృష్టించడంతో గుజరాత్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. మరోవైపు పొట్టి ఫార్మాట్ చరిత్రలో పది వికెట్ల తేడాతో గెలిచిన తొలి జట్టుగా నైట్‌రైడర్స్ రికార్డులకెక్కింది.