ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బి ఆర్ యస్ పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి.

 

జనం సాక్షి, డిసెంబర్ 23,భువనగిరి (ఆర్.సీ);
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రైతులపై సవీతి ప్రేమతో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బి ఆర్ యస్ పార్టీ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన నడిరోడ్డు పైన టెంట్లు వేసి రైతులకు విద్యార్థులకు రోగులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందుల గురిచేసి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి అధికార పార్టీ ఏది చేసిన చెల్లుతుందని భువనగిరి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చట్టపరమైన కేసులు నమోదు చేయాలని మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని లేకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాహనదారులపై రైతుల టాక్టర్లపై ద్విచక్ర వాహనాలపై విద్యార్థి ఉద్యోగాల వాహనాల పైన ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసి చాలాన్లను విధించిన వాటిని అన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ కోటర్ జాతీయ రహదారి పైన అనునిత్యం ప్రజలు రోగులు విద్యార్థులు యువకులు, మహిళలు వాహనదారులు వివిధ పనుల పైన వైద్యం చేసుకోవడం కోసం ఆస్పత్రులకు వెళుతూ ఉంటే నడిరోడ్డుపై అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలు పట్టనట్లుగా ధర్నాలు కావలసికొని చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండగా ఉండి ప్రత్యక్షంగా పోలీసులు నిలబడి వాళ్లకు సెక్యూరిటీ కల్పిస్తూ ధర్నాలు చేయించడం ఎంతవరకు సమంజసమని పోలీసులు కూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు నడిరోడ్డు పైన ధర్నాలు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చట్టపరమైన కేసులు నమోదు చేయకపోతే ప్రజా ఆందోళన చేపడుతామని అంచలవారీగా ప్రజా ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, పడిగెల ప్రదీప్ వడిచెర్ల కృష్ణ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు గోదా రాహుల్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి మధు, సీనియర్ నాయకులు మాదాసు గోవర్ధన్, గుర్రాల శ్రీనివాస్, గ్యాస్ చిన్న పార్వతి, మల్లేష్, మల్లారెడ్డి హరీష్, రంజిత్, నరేష్, సురేష్ నరసింహ, విజేందర్, నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
వడపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో ముందంజ.