డెంగీపీడిత గ్రామంలో అధికారుల పర్యటన

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రాష్ట్ర కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమ అదనపు సంచాలకులు డా.ఎస్‌.ప్రభావతి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం శుక్రవారం గ్రామాన్ని సందర్శించింది. జ్వర పీడిత ప్రాంతాలను, వైద్యశిబిరంలో చికిత్స పొందుతున్న వారిని బృంద సభ్యులు పరిశీలించారు. జ్వర పీడితులతో వారు చర్చించారు. డెంగీ జ్వరానికి భయపడాల్సిన పనిలేదని సూచించారు. కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు మధుసూధనరెడ్డి, మాధవ్‌, డబ్ల్యూహెచ్‌వో రాష్ట్ర కన్సల్టెంట్‌ సంజీవరెడ్డి, డీఎంహెచ్‌వో కొండలరావు, డీపీవో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.