డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో తగ్గుతున్న రాత్రి ప్రమాదాలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల రాత్రివేళ జరిగే ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయని కమిషనరేట్ పరిధి పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తాగి అడ్డగోలుగా వాహనాలు నడిపే మందుబాబుల ఆగడాలను అణిచివేయడానికి సైబరాబాద్ కమీషనర్ కార్యాలయం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రధాన రహదారులు, ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నవంబర్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా 6824 కేసులను నమోదు చేయడంతో పాటు 93 మందికి నేను శిక్ష విధించడం జరుగిందని, రెండు కోట్ల 37 లక్షల 25 వేల రూపాయలను జరిమానాగా విధించడం జరిగిందని వారు తెలిపారు. ప్రజల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కొంత అవగాహన పెరగడం వల్ల రాత్రి వేళల్లో మందుబాబుల జోరు తగ్గిందన్నారు.