ఢిల్లీలో చెట్ల నరికివేతకు హైకోర్టు బ్రేక్‌

ప్రభుత్వ ప్రాజెక్టుపై ఆగ్రహం
పర్యావరణ విధ్వంసపై వేసిన రిట్‌పై విచారణ
ఒక్కో చెట్టుకు పది చెట్లు నాటుతామన్న ప్రభుత్వం
న్యూఢిల్లీ,జూన్‌25(జ‌నం సాక్షి ): రాజధాని ఢిల్లీలో  చెట్ల నరికివేత ప్రాజెక్టుకు ఢిల్లీ హైకోర్టు బ్రేకేసింది. వివాదాస్పద ప్రాజెక్టు కింద ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1700 చెట్లను నరికివేసేందుకు ప్లాన్‌ వేసింది. ప్రభుత్వ అధికారుల నివాసాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల కోసం ఆ చెట్లను కొట్టివేయాలని భావించారు. కానీ  తీర్పులో చెట్ల నరికివేత ప్రాజెక్టుకు చుక్కెదురైంది. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చెట్ల నరికివేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా అని కోర్టు ప్రశ్నించింది. ఈ కార్యక్రమాన్ని జూలై 4 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్టక్షన్ర్‌ కార్పొరేషన్‌ సంస్థ ఢిల్లీలో చెట్ల నరికివేత ప్రాజెక్టు చేపట్టింది. దాన్ని అడ్డుకుంటూ దాఖలైన పిటీషన్‌పై సోమవారం  వాదనలు జరిగాయి. కాలనీల పునర్‌ నిర్మాణం పేరుతో సాగుతున్న ప్రాజెక్టును నిలిపివేయాలని పిటీషనర్‌ కేకే మిశ్రా డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో 9 లక్షల చెట్ల కొరత ఉందని, అలాంటి సమయంలో వేల చెట్లను నరకడం సమంజసం కాదు అని, ఈ అంశంలో కోర్టు స్టే ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.  అయితే  ప్రభుత్వ అధికార కార్యాలయాల కోసం, నివాస సముదాయాల కోసం 17వేల చెట్లను నరికివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వ్యాఖ్యలపై స్థానికులు, పర్యావరణకార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురైంది. దీంతో తాను మంత్రిగా కొనసాగినంతకాలం ఒక చెట్టును కూడా నరకడానికి వీలులేదని, నరికిన ఒక చెట్టుకు బదులుగా పది చెట్లను నాటాలని పేర్కొంటూనే తన ప్రణాళికను రద్దు చేయలేదని సోమవారం స్పష్టం చేశారు. సరోజినీ నగర్‌లో చాలా వరకు చెట్లను నరికివేసి అపార్ట్‌మెంట్లను నిర్మించే ఆలోచనలో ఉన్నారని, వాటిలో 15 శాతం అపార్ట్‌మెంట్ల విక్రయాలు కూడా చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అధికారుల అభివృద్ధి వాణిజ్యస్థలాల నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు. కాగా, ఒక చెట్టును నరికితే బదులుగా పది చెట్లను నాటాలని పేర్కొంటున్న వాదనపై సోషల్‌విూడియాలో నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఈ వాదనను తోసిపుచ్చుతూ రాష్ట్ర భవన నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌ పూరిపై పలువరు ఆగ్రహిస్తూ టీట్లు చేస్తున్నారు. తాను ప్రజల కోసం విధులు నిర్వహించే వ్యక్తినని, తన పట్ల అగౌరవంగా మాట్లాడటం సరికాదని హర్దీప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సరోజినీ నగర్‌లో స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు సుమారు 1,500మంది 1970లో ఉత్తరాఖండ్‌లో జరిగిన చిప్కో ఉద్యమం మాదిరిగా చెట్లను కట్‌ చేయకుండా అడ్డుకున్నారు.