ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసిన ఆ 3 తప్పులు

అందు వల్లే ఐపీఎల్‌ 2020 ఫైనల్స్‌లో ఓడిపోయారు..!!

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్‌ 2020 ఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్‌ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ట్రోఫీకి కొంచెం దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఓపెనింగ్‌ మార్కస్‌ స్టోయినిస్‌ చేత అవ్వడం. మార్కస్‌ స్టోయినిస్‌ తో ఓపెన్‌ అయ్యే స్ట్రాటజీ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో ఆడినప్పుడు పని చేసింది కానీ ఫైనల్స్‌ లో వర్క్‌ అవుట్‌ అవ్వలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మొమెంటం కోల్పోయింది. ఒక వేళ అజింక్య రహానే ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితిని నివారించే అవకాశాలు ఉండేవి. మార్కస్‌ స్టోయినిస్‌ టెక్నిక్‌ తో పోలిస్తే అజింక్య రహానే టెక్నిక్‌ మెరుగ్గా ఉంటుంది. గేమ్‌ లో ప్రెజర్‌ బాగా ఉండటంతో, అలాగే అపోజిషన్‌ లో ట్రెంట్‌ బౌల్ట్‌ మరియు బుమ్రా బౌలర్లుగా ఉండటంతో, స్టోయినిస్‌ ని పంపడం పొరపాటు కిందకి వచ్చింది. ఓపెనింగ్‌ లో రాహనే ని పంపించి ఉంటే డెత్‌ ఓవర్స్‌ టైమ్‌ లో స్టోయినిస్‌ స్టైక్ర్‌ లో ఉండేవారు. కాబట్టి లాస్ట్‌ ఓవర్లలో రన్స్‌ కొంచెం ఎక్కువగా వచ్చేవి. టార్గెట్‌ కూడా కొంచెం ఎక్కువగా సెట్‌ చేయగలిగేవాళ్ళు. ముంబై ఇండియన్స్‌ జట్టులో ఎక్స్పీరియన్డ్స్‌ బౌలర్లు ఓపెనింగ్‌ చేస్తారు కాబట్టి రహానే ఉండి ఉంటే వికెట్‌ పడకుండా స్టాండ్‌ ఇచ్చేవారు.

రెరడవది శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంకా రిషబ్‌ పంత్‌ ఫినిషింగ్‌ సరిగా చేయకపోవడం. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఓపెనర్స్‌ కొంచెం తడబడినా, తర్వాత మిడిల్‌ ఆర్డర్స్‌ బలంగా ఆడారు. ముంబై ఇండియన్స్‌ జట్టుపై బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ గట్టి భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత తగ్గారు. చివరిలో ఫినిషింగ్‌ సరిగ్గా చేయలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు స్కోర్‌ మార్జిన్‌ లో చాలా తేడా వచ్చింది. డిసి చివరి ఐదు ఓవర్లలో కేవలం 38 పరుగులు చేసింది, ఒక వేళ 60 పరుగులు చేసి ఉంటే, ముంబై ఇండియన్స్‌ జట్టుకి స్కోర్‌ లక్ష్యం ఎక్కువగా ఉండేది. మూడవ పొరపాటు కగిసో రబాడా, అన్రిచ్‌ నార్‌జ్టే రెరడవ స్పెల్‌ కోసం చాలా సేపు వెయిట్‌ చేయడం. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకి ఉన్న పేస్‌ బౌలర్లు రబాడా మరియు నార్‌జ్టే. ఆ ఇద్దరికీ రెరడవ స్పెల్‌ చాలా లేట్‌ గా ఇచ్చారు శ్రేయాస్‌ అయ్యర్‌. ఒక పక్క వికెట్లు పడకుండా ముంబై ఇండియన్స్‌ ఈజీగా చేజింగ్‌ చేస్తున్న సమయంలో రబాడా కి కానీ, నార్‌జ్టే కి కానీ బౌలింగ్‌ ఇవ్వలేదు ఢిల్లీ క్యాపిటల్స్‌. చివరిలో వాళ్ళిద్దరూ వికెట్స్‌ తీశారు. కానీ అది పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.