ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సిఎం

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): 10 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ ఆయన భార్య ప్రతిభ ఢిల్లీ హైకోర్టును బుధవారం ఆశ్రయించారు. సిబిఐ దాఖలు చేసిన ఈ కేసులో తమపై అభియోగాలను నమోదు చేయాలని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు ఈ దంపతులపై నమోదైన ఆరోపణలపై కోర్టు ఎటువంటి విచారణ చేయలేదు. తదుపరి విచారణ ఈ నెల 29న చేపట్టనుంది. యాపిల్స్‌ విక్రయాల లావాదేవీల్లో లెక్కించని డబ్బును సమర్పించడం ద్వారా పన్ను అధికారులకు నష్టం జరగాలని సింగ్‌ కోరుకుంటున్నాడని కోర్టు గత డిసెంబర్‌లో పేర్కొంది. ఈ నేరాలకు పాల్పడిన ఆయన భార్య, ఏడుగురుపై అభియోగాలు మోపాలని ఆదేశించింది.