తగ్గిన పసిడి ధర

– రెండు రోజులకు రూ.175 తగ్గుదల
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణంగా పసిడి ధర వరుసగా మూడో రోజు పడిపోయింది. శుక్రవారం రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,300కి చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, యూఎస్‌ ఫెడ్‌ సమావేశం, డాలరు పడిపోవడం బంగారం ధర తగ్గుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో పాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు మరో కారణం. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.175 తగ్గింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి భారీగా తగ్గి రూ.38వేల మార్క్‌కు చేరుకుంది. రూ.450 తగ్గడంతో కిలో వెండి రూ.38,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ రాకపోవడంతో వెండి ధర భారీగా తగ్గింది. నిన్న వెండి ధర రూ.300 తగ్గింది. ఇక అంతర్జాతీయం గానూ బంగారం ధర పడిపోయింది. బంగారం ధర 0.98శాతం తగ్గడంతో ఔన్సు 1,182.40 డాలర్లు
పలికింది.