తమిళనాట మళ్లీ వేడిపుట్టిస్తున్న రాజకీయాలు

 

చెన్నై,జనవరి18(జ‌నంసాక్షి): తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కమలహాసన్‌ 21న పార్టీ ప్రకటిస్తానని అన్నారు. దినకరన్‌ పావులు కదుపుతున్నారు. రజనీ కాంత్‌ రెడీగా ఉన్నారు. జయలలిత మరణం తరవాత కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీలు ఏ మేరకు స్థిర రాజకీయాలు ఇస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పరిణామాలను విపక్ష డిఎంకె ఆచితూచి చూస్తోంది. ఇలా ఇతరులను అడ్డంపెట్టుకుని బిజెపి కుట్రలు చేస్తోందని కూడా స్థానికులు వ్యాఖ్యానించారు. జయ మరణం తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించిన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని వ్యూహాత్మకంగా చేజిక్కించుకున్నారు. ఈ విషయంలో తనకు ఎదురు లేకుండా చూసుకున్నారు. అయితే సుప్రీం తీర్పుతో జైలుకు వెళ్లడం, పార్టీ పదవిని కలో/-పోవడంతో తమ చేతుల్లోంచి అన్నాడిఎంకె పూర్తిగా చేజారిపోయింది. జయలలిత మరణంపై ధృఢపడుతున్న అనుమానాలు శశికళ పట్ల వ్యతిరేకత పెల్లుబుకడానికి దోహదం చేస్తున్నాయి. మారుతున్న సవిూకరణాల నేపథ్యంలో వెంటనే ఏవిూ జరగక పోవచ్చు. ముఖ్యమంత్రి

పళనిస్వామికి,పన్నీరుసెల్వంకు మధ్య సయోధ్య లేదనే వార్తుల వస్తున్నాయి. జయలలిత మరణంపై అనుమానాలు.. శశికళపై వ్యతిరేకతను పెంచుతున్న తరుణంలో చాలా మంది పార్టీ నాయకులు, సభ్యులు కొత్తనాయకత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడానికి స్పష్టమైన అజెండాను కోరుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే పళనిసస్వామి పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన వార్తలతో శ్రేణులను కట్టిపడేసే సాధనాలుగా తమిళనాట ప్రచార మాధ్యమాలు ఉపయోగపడినట్లు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. పార్టీల వారీగా మాధ్యమాలు… వాటిని అంటిపెట్టుకుని ఉన్న అభిమానులకు రాష్ట్రంలో కొదవలేదు. అందుకే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలకు నమదు ఎంజీఆర్‌, మురుసొలి పత్రికలు… ఛానెళ్లలో జయ టీవీ, సన్‌ టీవీలు కీలకంగా మారాయి. జయలలిత మరణం, పార్టీలో వచ్చిన చీలికల నేపథ్యంలో నమదు ఎంజీఆర్‌, జయ టీవీల్లో వస్తున్న కథనాలు, వార్తలు అధికార పార్టీలోని ఒక వర్గానికి మింగుడు పడటంలేదు. జయలలిత ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నడుపుతున్నప్పటికీ జయలలిత ప్రారంభించిన ప్రసార మాధ్యమాలను మాత్రం శశికళ కుటుంబం నిర్వహిస్తోంది. దీంతో అధికార అన్నాడీఎంకే అగ్రనాయకులతో పాటు ఒక వర్గం కార్యకర్తలను ఆ వార్తలు, కథనాలు అయోమయానికి గురి చేశాయి. దీంతో గతేడాది అక్టోబరులోనే సొంత పత్రిక, టీవీ ఛానెల్‌ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సంకల్పించారు. దీంతో సొంత పత్రిక, టీవీ మాధ్యమాలను పెట్టుకోవాల్సిన అవసరాన్ని అధికార పార్టీ గుర్తించింది. అంతరాయానికి ముగింపు పలకాలనుకుంది. ఈ క్రమంలో ప్రముఖ తమిళ పత్రిక, టెలివిజన్‌ ఛానెల్‌లను సొంతం చేసుకోవడానికి చర్యలు చేపట్టిందని, అది కుదరని పక్షంలో కొత్తవాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ రెండు మాధ్యమాలకు సంబంధించిన వ్యవహారాలను చూడటానికి మంత్రులు ఎస్పీ వేలుమణి, మాఫొయ్‌ పాండియరాజన్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. /ూష్ట్రంలో రాజకీయ వ్యూహప్రతివ్యూహాలను అమలు చేయడం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేయడం కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సొంత మాధ్యమాలను ఏర్పాటు చేసుకున్నాయి. తద్వారా తమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కొత్తగా తెరపైకి వస్తున్న కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లు ఏ రకమైన ప్రచార ఒరవడి సృష్టిస్తారో చూడాలి.